: విమాన ప్రమాదంలో 40 మృతదేహాలు వెలికితీత
ఆదివారం ఉదయం 162 మందితో అదృశ్యమైన ఏయిర్ఏషియా విమాన శకలాలతో పాటు 40 వరకూ మృత దేహాలను కనుగొన్నామని ఇండోనేషియా నౌకాదళ అధికారులు ప్రకటించారు. వీటిని వెలికితీసి ప్రత్యేక నౌకల ద్వారా తీరానికి చేర్చినట్టు రెస్క్యూ టీం డైరక్టర్ ఎస్.బి.సుప్రియాది తెలిపారు. మృతదేహాలన్నీ ఉబ్బిపోయి ఉన్నాయని ఆయన వివరించారు. మృతదేహాలు లభించిన బోర్నియా ద్వీపం సమీపంలోనే విమానం కూలిపోయి ఉండవచ్చని ఆయన అన్నారు. కూలిపోయే సమయంలో విమానం తీవ్రంగా దెబ్బతిన్నందునే మృతదేహాలు సముద్ర పైభాగంలోకి వచ్చాయని తెలిపారు.