: సీఆర్ డీఏ చట్టానికి గవర్నర్ ఆమోద ముద్ర
ఏపీ సీఆర్ డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) చట్టానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆమోద ముద్ర వేశారు. దాంతో, సీఆర్ డీఏ చట్టాన్ని ప్రభుత్వం గెజిట్ లో ప్రకటించింది. ఈ నెల 22న సీఆర్ డీఏ బిల్లుకు శాసనసభ అంగీకారం తెలపడం, అనంతరం సమగ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి ఏపీ రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూసమీకరణకు శ్రీకారం చుట్టనున్నట్టు సీఆర్ డీఏ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. సమీకరణలో వెయ్యి నుంచి 1400 ఎకరాలను ఓ యూనిట్ గా పరిగణిస్తారు.