: గవర్నర్ వద్దకు చేరిన ఎంసెట్ నిర్వహణ వివాదం
రెండు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ పరీక్ష నిర్వహించే అధికారం తమకే ఉందంటూ ఏపీ ఉన్నత విద్యామండలి పరీక్ష తేదీ ప్రకటించడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. దాంతో, తమ రాష్ట్రంలో తామే ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రకటించారు. తాజాగా ఈ సమస్య గవర్నర్ నరసింహన్ వద్దకు చేరింది. మరికాసేపట్లో ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలవనున్నారు. ఎంసెట్ నిర్వహణ ఏపీ పరిధిలోకే వస్తుందని గంటా తెలపనున్నారు.