: ‘పీకే’కు పన్ను మినహాయింపునివ్వాలి: స్వామి అగ్నివేశ్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘పీకే’పై ఓ వైపు హిందుత్వ వాదులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుండగా, సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేశ్ మాత్రం ఆ చిత్రానికి మద్దతు ప్రకటించారు. హిందూ మత విశ్వాసాలను ఆసరా చేసుకుని ప్రజలను మోసగిస్తున్న వారికి వ్యతిరేకంగా తీసిన ఈ చిత్రానికి పన్ను మినహాయింపునివ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘పీకే’కు బీజేపీ అగ్రనేత అద్వానీ ఇప్పటికే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే శివుడిని కించపరుస్తూ రూపొందిన ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ సహా భజరంగ్ దళ్ లు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే డిమాండ్ తో ఆ సంస్థల కార్యకర్తలు నిన్న కొన్ని థియేటర్లపై దాడులు కూడా చేశారు.