: యశోద ఆసుపత్రిలో టీడీపీ మాజీ నేత సీహెచ్.రాజేశ్వరరావు
ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలోని బాత్ రూమ్ లో జారిపడ్డ ఆయనను... కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి తరలించారు. కుడికాలు తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రాజేశ్వరరావుకు బీపీ, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటంతో వాటికి చికిత్స చేస్తున్నారు. ఆయన శరీరం సాధారణ స్థితికి చేరుకోగానే శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. ఆయన కుమారుడు, వేములవాడ ఎమ్మెల్యే సీహెచ్.రమేష్ బాబు జర్మనీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు.