: కొనసాగుతున్న మార్ష్ జోరు... భారీ స్కోరు దిశగా ఆసీస్
ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ జోరు కొనసాగుతోంది. మెల్ బోర్న్ లో భారత్ తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఇప్పటికే ఏడు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసిన ఆసీస్, మరింతసేపు బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లోనూ భారత్ పై ఆధిక్యం సాధించిన ఆసీస్ ప్రస్తుతం రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 362 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. మార్ష్ (83), ర్యాన్ హారిస్ (20) క్రీజులో కొనసాగుతున్నారు. ఆసీస్ ను త్వరితగతిన ఔట్ చేసేందుకు భారత బౌలర్లు చెమటోడుస్తున్నారు.