: మత మార్పిళ్లకు వీహెచ్ పీ వ్యతిరేకం... ముస్లింలను, క్రైస్తవులను ఆహ్వానిస్తాం: ప్రవీణ్ తొగాడియా
మత మార్పిళ్లకు విశ్వహిందూ పరిషత్ వ్యతిరేకమని వీహెచ్ పీ అగ్రనేత ప్రవీణ్ తొగాడియా తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముస్లిం, క్రైస్తవులను హిందూ మతంలోకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. భారతదేశంలో పూర్వం కేవలం హిందువులు మాత్రమే ఉండేవారని ఆయన అన్నారు. ఇప్పుడు కూడా భారత్ హిందూ దేశమేనని, భవిష్యత్ లో కూడా భారతదేశం హిందూ దేశంగానే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పునరాగమన కార్యక్రమం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని తొగాడియా తెలిపారు. పేద హిందూ విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని, అందుకోసం హెల్ప్ లైన్ ను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. దళితులకు ఆలయాల్లోకి ప్రవేశం కల్పించే కార్యక్రమం చేపట్టామని తొగాడియా వెల్లడించారు.