: మహా నగరాలన్నింటిలో సీసీటీవీలు ఏర్పాటు చేయండి: రాజ్ నాథ్ సింగ్
మహా నగరాలన్నింటిలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. ఏదైనా ప్రాంతంలో పేలుళ్లు జరిగితే సరైన దర్యాప్తుకు సీసీటీవీ ఫుటేజ్ సహకరిస్తుందని చెప్పారు. బెంగళూరులో జరిగిన బాంబు పేలుడు నేపథ్యంలో ఈ మేరకు రాజ్ నాథ్ స్పందించారు. ఈ ఘటనపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమాచారాన్ని సేకరిస్తున్నాయని, కర్ణాటక ప్రభుత్వంతో ఘటనపై మాట్లాడుతున్నామని తెలిపారు. జరిగిన సంఘటనపై 24 గంటల్లో సమాచారం మొత్తం సేకరిస్తారని, తదుపరి వ్యూహాన్ని ప్లాన్ చేస్తామని అన్నారు.