: ఏపీ కొత్త రాజధాని ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలపై విచారణాధికారి నియామకం


ఏపీ కొత్త రాజధాని ప్రాంతాల్లో జరిగిన అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం విచారణాధికారిని నియమించింది. ఈ మేరకు ట్రాన్స్ కో అధికారి విజయానంద్ నియమితులయ్యారు. చోటుచేసుకున్న ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో సంభవించిన ప్రమాదాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే ప్రమాదాలు జరగడం వెనుక వైసీపీ కార్యకర్తల హస్తం ఉందని ఏపీ మంత్రులు, నేతలు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News