: శుక్ర గ్రహంపై తేలియాడే మానవ నగరం నిర్మాణానికి నాసా ప్రణాళికలు
భూమికి అతి దగ్గరగా ఉన్న శుక్ర గ్రహ కక్ష్యలో తేలియాడే మానవ నగరాన్ని నిర్మించాలని నాసా భావిస్తోంది. తొలుత 30 రోజుల పాటు అంతరిక్షంలో మానవులు నివసించేలా ఓ ప్రాజెక్టును నాసా చేపట్టనున్నట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందుకోసం హావోక్ (హై ఆల్టిట్యూడ్ వీనస్ ఆపరేషనల్ కాన్సెప్ట్) పేరిట ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు వర్జీనియాలోని హంప్టన్ రీసెర్చ్ కేంద్రంలో ప్రయోగాలు చేపట్టారు. మార్స్ మీదకు మానవులను పంపేముందు అనుభవం కోసం ఈ ప్రయోగం ఉపకరిస్తుందని నాసా భావిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా నిధులను కేటాయించేందుకు నాసా సిద్ధంగా లేదని సమాచారం. దీంతో, శుక్ర గ్రహంపై తేలియాడే మానవ నగరం నిర్మాణానికి మరింత సమయం పట్టవచ్చు.