: సీపీఐ నారాయణపై కేసు నమోదు


బాలవరం థర్మల్ పవర్ ప్లాంటులో ఫర్నిచరు ధ్వంసం చేసినందుకు గాను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణతో పాటు మరో వందమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో బాలవరం థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటుకై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా జరిగిన లాఠీఛార్జిలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే.

ఈ సంఘటనలో బాధితులను పరామర్శించేందుకు నారాయణ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఫర్నిచరు ద్వంసం సంఘటన చోటు చేసుకుంది. 

  • Loading...

More Telugu News