: బెంగళూరు బాంబు పేలుడు కచ్చితంగా తీవ్రవాద దాడే: కర్ణాటక హోం మంత్రి
బెంగళూరు బ్రిగేడ్ రోడ్ సమీపంలోని చర్చి వీధిలో కోకోనట్ గ్రూప్ హోటల్ వెలుపల పాదచారుల మార్గంలో ఆదివారం రాత్రి బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పందిస్తూ, ఈ ఘటన కచ్చితంగా తీవ్రవాదుల దాడేనని అన్నారు. ఇంతవరకు ఎవరూ ఈ పని తమదేనని ప్రకటించుకోలేదన్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని ఈ ఉదయం పరిశీలించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తుందని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు.