: ఎయిర్ ఏషియా కోసం కొనసాగుతున్న గాలింపు


ఇండోనేషియా నుంచి సింగపూర్ బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం జావా సముద్రం గగనతలంపై అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానం జాడ ఇంకా మిస్టరీగానే ఉంది. ఆదివారం పొద్దుపోయేదాకా కొనసాగిన గాలింపు చర్యలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాత్రి నిలిచిపోయాయి. తిరిగి నేటి ఉదయం మొదలైన గాలింపు చర్యల్లో ఇండోనేషియాతో పాటు ఆస్ట్రేలియా కూడా పాలుపంచుకుంటోంది. జావా సముద్రంలో విమాన శకలాలు కనిపించాయన్న మీడియా కథనాలను ఎయిర్ ఏషియా ధ్రువీకరించలేదు. ఇండోనేషియాలోని సురబయ నుంచి సిబ్బందితో కలిపి మొత్తం 162 మందితో సింగపూర్ బయలుదేరిన విమానం గమ్యం చేరకుండానే అదృశ్యమైంది. అయితే పిడుగులు పడిన కారణంగానే విమానం కూలిపోయిందని నేటి ఉదయం నుంచి వార్తలు వినవస్తున్నాయి.

  • Loading...

More Telugu News