: ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాజీనామాతో సచిన్ టెండూల్కర్ కు సంబంధం లేదు!


ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్‌ రఘునాథ్‌ షెగావకర్‌ రాజీనామా చేసిన అంశంలో క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు ఎటువంటి సంబంధమూ లేదని కేంద్ర మానవ వనరుల శాఖ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎంపీ సచిన్‌ ఏర్పాటు చేయాలనుకున్న క్రికెట్ అకాడమీకి స్థలం ఇవ్వాలంటూ ఒత్తిడి రావడం వల్లే ఆయన రాజీనామా చేశారని, అలాగే బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి బకాయిలకు సంబంధించి కూడా రఘునాథ్‌పై హెచ్‌ఆర్‌డీ వర్గాలు ఒత్తిడి చేశాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను హెచ్‌ఆర్‌డీ వర్గాలు ఖండించాయి. రఘునాథ్‌ తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని తెలిపింది. మరోవైపు అకాడమీ కోసం ఎవరినీ స్థలం అడగలేదని, అసలు తనకు అకాడమీ స్థాపించే ఆలోచనే లేదని సచిన్‌ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News