: తెలుగు రాష్ట్రాల్లో భారీగా 'ఘర్ వాపసీ'... 8 వేల మంది హిందూ మత స్వీకరణ
విశ్వ హిందూ పరిషత్ చేపట్టిన 'ఘర్ వాపసీ' కార్యక్రమం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లోనే కాక ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ సంఖ్యలో ఇతర మతస్తులను హిందూ మతంలోకి మార్పించామని వీహెచ్ పీ నేత వెంకటేష్ వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లో దాదాపు 8 వేల మందిని హిందూ మతంలోకి తీసుకువచ్చామని... కేవలం హైదరాబాదులోనే వీరి సంఖ్య 1200గా ఉందని స్పష్టం చేశారు. ఇవి మత మార్పిడులు కావని, స్వగృహ ప్రవేశాలని చెప్పారు. గతంలో క్రిస్టియన్లుగా మారిన వారు తిరిగి హిందూ మతం స్వీకరించారని వెంకటేష్ తెలిపారు. హైదరాబాద్ కుషాయిగూడలోని బాలాజీనగర్, బోరబండ, ఉప్పల్, ఎస్.టి.హిల్స్ తదితర ప్రాంతాల్లో స్వగృహ ప్రవేశాలు జరిగాయని చెప్పారు.