: 'పీకే'లో సన్నివేశాలు తొలగించం: సెన్సారు బోర్డు


'పీకే' సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, వాటిని తొలగించాల్సిందేనని కొన్ని హిందుత్వ సంస్థలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ లీలా శాంసన్ స్పందించారు. 'పీకే'లో ఎలాంటి సన్నివేశాలు తొలగించబోమని, ఇప్పటికే ఆ సినిమా విడుదలైందని స్పష్టం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, 'పీకే' చిత్రానికి సర్టిఫికెట్ ఇచ్చేశామని, ప్రజల వీక్షణార్థం ఇప్పటికే థియేటర్లలో ప్రదర్శితమవుతోందని వివరించారు. అటు, ముస్లిం సంఘాలు కూడా ఈ సినిమాలో మత విశ్వాసాలను దెబ్బతీసే సీన్లు ఉన్నాయని ఆరోపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News