: తిరిగి ప్రారంభమైన మెల్ బోర్న్ టెస్టు... రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
ఆస్ట్రేలియా, భారత్ ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు, నాలుగో రోజు ఆట వర్షం అంతరాయం తర్వాత తిరిగి ప్రారంభమైంది. స్వల్ప విరామం తర్వాత ప్రారంభమైన మ్యాచ్ లో ఆసీస్ రెండో వికెట్ ను కోల్పోయింది. షేన్ వాట్సన్ (17) ఇషాంత్ బౌలింగ్ లో ధోనీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 98 పరుగుల వద్ద వాట్సన్ వెననుదిరగడంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (12) క్రీజులోకొచ్చాడు. ఓపెనర్ రోజర్స్ (53) అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.