: గాల్లో తిరిగితే సమస్యలెలా తెలుస్తాయి?: ఎర్రబెల్లి
టీఆర్ఎస్ సర్కారుపై తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ వరుస ఏరియల్ సర్వేలపై విమర్శనాస్త్రాలు సంధించారు. గాల్లో తిరిగితే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. తెలంగాణను సింగపూర్, మలేసియా దేశాల్లా తయారు చేయాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తే చాలని హితవు పలికారు. కరవు మండలాలను ఇప్పటివరకు ఎందుకు ప్రకటించలేదని నిలదీశారు. టీఆర్ఎస్ సర్కారు కోతల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు.