: ఐదో వికెట్ కోల్పోయిన భారత్...టీమిండియా స్కోరు 416/5
ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరుగుతున్న మూడో టెస్టులో కొద్దిసేపటి క్రితం టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. టెస్టుల్లో మూడో శతకాన్ని నమోదు చేసిన భారత బ్యాట్స్ మన్ అజింక్యా రెహానే 147 వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆసిస్ సంచలనం లియాన్ బౌలింగ్ లో రెహానే ఎల్ బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెహానే ఔటవడంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన కొత్త బ్యాట్స్ మన్ లోకేష్ రాహుల్(3) స్వల్ప స్కోరుకే లియాన్ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. దీంతో కేవలం ఆరు పరుగుల తేడాలోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కోహ్లీ (143)కి కెప్టెన్ ధోనీ జతకలిశాడు. 111 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 416 పరుగులు చేసింది.