: కేంద్ర పరిశోధన సంస్థల ఏర్పాటులో ఏపీకి ప్రాధాన్యం: కేంద్ర మంత్రి సుజనా
కేంద్ర పరిశోధన సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశోధన సంస్థల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని ఏపీ సర్కారు అందిస్తే, మిగిలిన వాటిని కేంద్రం చూసుకుంటుందని ఆయన తెలిపారు. ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ల విషయంలో తమ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విజ్ఞప్తికి కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.