: నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో తెలంగాణ సీఎం ఏరియల్ సర్వే


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్న ఆయన, హైదరాబాద్ లోని రహదారులు, ట్రాఫిక్ స్థితిగతులను పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ చిక్కులను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పోలీసు బాసులకు పలు సలహాలు, సూచనలు చేయనున్నారు. రహదారుల అభివృద్ధిపైనా ఆయన దృష్టి కేంద్రీకరిస్తారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోనూ ఏరియల్ సర్వే నిర్వహించనున్న కేసీఆర్, జిల్లాలోని అటవీ భూములను పరిశీలించనున్నారు.

  • Loading...

More Telugu News