: రాహుల్ పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోవాలి: డిగ్గీరాజా
రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా కాకుండా, అధ్యక్షుడిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సూచించారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఆయన మాట్లాడుతూ, రాహుల్ పార్టీని నడిపిస్తే తామంతా ఆయన వెనుక ఉంటామని అన్నారు. సోనియా గాంధీ ఎప్పటికీ తమ పార్టీ నాయకురాలని, ఆమె నాయకత్వంలోనే తమ పార్టీ కొనసాగుతుందని పలికిన డిగ్గీ, రాహుల్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలని కోరారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిభపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలు గందరగోళంలోకి నెడుతున్నాయి.