: ప్రేమికుల బైక్ రేసింగ్... ప్రమాదంలో ప్రియురాలి మృతి
వారిద్దరూ ప్రేమికులు... సరదాగా రేస్ బైక్ మీద సవారీ చేద్దామనుకున్నారు. అదుపుతప్పిన బైక్ పల్టీలు కొట్టగా, తీవ్రగాయాలతో ప్రేమికులిద్దరూ ఆసుపత్రిలో చేరారు. నేటి ఉదయం నుంచి మృత్యువుతో పోరాడిన ప్రియురాలు చివరికి ప్రాణాలు విడిచింది. అటు, ఆ యువకుడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన హైదరాబాదు శివారు హయత్‌నగర్ మండలం సంఘీనగర్‌లో జరిగింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని బైక్‌పై ఎక్కించుకుని అందరూ చూస్తుండగా, బైక్ రేసింగ్ చేశాడు. ఆ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.