: సల్మాన్ కు స్ట్రాబెర్రీ కేక్ తో కుటుంబ సభ్యుల బర్త్ డే విషెస్


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ 49వ పడిలో పడ్డారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు వినూత్నమైన కేక్ కానుకగా ఇచ్చారు. ఈ కేక్ ను స్ట్రాబెర్రీలతో తయారుచేశారు. కాగా, సల్లూ భాయ్ పుట్టిన రోజును సోదరి అర్పితా ఖాన్, ఆమె భర్త ఆయుష్ శర్మ, తండ్రి సలీమ్ ఖాన్ తదితర కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. సల్మాన్ తన పుట్టిన రోజు కేక్ ను ఫోటో తీసి ట్వీట్టర్లో పెట్టారు. సల్లూ భాయ్ బర్త్ డే సందర్భంగా అన్ని వర్గాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News