: ఆ పావురం ఆచూకీ తెలిపితే రూ. 8 లక్షలు సొంతం చేసుకోవచ్చు
జర్మనీలోని డ్యూస్సెల్డార్ఫ్ నగర పోలీసులు ఇప్పుడు యమా బిజీగా ఉన్నారు. ఎందుకో తెలుసా? మిస్ అయిన ఓ పావురాన్ని పట్టుకోవడానికి. ఒక పావురం కోసం ఇంత బిల్డప్పా అనుకోకండి. మిస్ అయింది ఆషామాషీ పావురం కాదు మరి. దాని విలువ ఏకంగా లక్షా యాభై వేల యూరోలట. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాలా రూ. 1.20 కోట్లు. పావురం యజమాని దానికి కట్టిన విలువ ఇది. మిస్ అయిన పావురం పేరు 'ఏఎస్ 969'. ఇంకో విషయం తెలుసా... ఈ పావురం ఆచూకీ తెలిపిన వారికి 10 వేల యూరోల (దాదాపు రూ. 8 లక్షలు) బహుమతిని ప్రకటించాడు దాని ఓనర్. డ్యూస్సెల్డార్ఫ్ నగర శివార్లలోని పక్షిశాలలో ఉన్న ఈ పావురాన్ని శనివారం రాత్రి దొంగలు దొంగిలించారు.