: బంగారాన్ని మింగి... కస్టమ్స్ అధికారులకు చిక్కి..!


బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారిని కట్టడి చేసేందుకు కస్టమ్స్ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటుంటే, స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులను వెతుక్కుంటున్నారు. తాజాగా బంగారాన్ని గుళికల రూపంలో తయారు చేసి వాటిని మింగి కడుపులో దాచుకొని మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి అబ్దుల్లా అనే వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు స్కానింగ్ చేసి చూడగా 350 గ్రాముల బంగారం లభించింది. అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News