: ఆ ముగ్గురు మాత్రమే 'పీకే'లాంటి సినిమా తీయగలరు: సంజయ్ దత్
అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ, విధు వినోద్ చోప్రా మాత్రమే 'పీకే'లాంటి సినిమా తీయగలరని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ తెలిపారు. 14 రోజుల పెరోల్ పై విడుదలైన ఆయన పీకే సినిమాను చూశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాస్తవాలతో నిజాయతీగా తీసిన సినిమా అని అన్నారు. అందుకే ఇంత అద్భుత విజయం సాధించిందని చెప్పారు. కాగా, ఈ సినిమాలో గ్రహాంతర వాసి (అమీర్ ఖాన్) స్నేహితుడి పాత్రను సంజయ్ దత్ పోషించారు.