: జయ స్నేహితురాలు శశికళ కూతురినంటూ... భారీ టోకరా


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కూతురినంటూ ఏకంగా రూ. కోటి నొక్కేసిందో జాణ. వివరాల్లోకి వెళ్తే, భువనేశ్వరి అనే మహిళ తన భర్త అళగేశ్వరన్ తో కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. ఈ క్రమంలో అమెరికా నుంచి తమ పిల్ల చదువుకోసం చెన్నై వచ్చిన శ్రీనివాసన్, విజయలలిత దంపతులతో ఆమెకు పరిచయం అయింది. తాను శశికళ కూతుర్నని, ప్రభుత్వంలోని పెద్దలంతా తనకు తెలుసని చెప్పుకుంది. చెన్నైలోని ప్రధాన ప్రాంతంలో తక్కువ ధరకే స్థలం ఇప్పిస్తానని చెప్పి... రూ. 10 లక్షల నగదు, రూ. 90 లక్షలకు చెక్కులు తీసుకుంది. రోజులు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ కాకపోవడంతో శ్రీనివాసన్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో, ఎట్టకేలకు భువను అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపారు పోలీసులు.

  • Loading...

More Telugu News