: విభజన చట్టంలోని రాయితీలను అడుగుతాం: యనమల


ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరుగుతున్న రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి ఆయన హస్తిన బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాలు బలంగా ఉంటేనే, కేంద్రం బలంగా ఉంటుందని చెప్పారు. వివిధ రాష్ట్రాల అభివృద్ధిలో వ్యత్యాసం ఉందని అన్నారు. స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన నిధులు రాష్ట్రాల వద్ద ఉండాలని యనమల తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న రాయితీలను ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News