: కొడుకును హింసించిన ప్రవాస భారతీయుడిపై అమెరికాలో కేసు


నాలుగు నెలల వయసున్న కొడుకును తీవ్రంగా హింసించిన ఓ తండ్రిపై అమెరికా పోలీసులు కేసు పెట్టారు. జగ్షీర్ సింగ్ అనే వ్యక్తి తన కొడుకు నేవిన్ ను ప్రాణాపాయం కలిగేంతగా కొట్టాడు. రేడియాలజిస్టుగా పనిచేస్తున్న భార్య రీనా ఉద్యోగానికి వెళ్ళిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆమె ఆఫీసు నుంచి తిరిగి వచ్చేసరికి బాబు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు గమనించి ఆసుపత్రిలో చేర్పించింది. బాలుడు టేబుల్ పై నుంచి కింద పడ్డాడని తండ్రి చెప్పగా, అది అవాస్తవమని డాక్టర్లు నిర్ధారించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, అతను కోలుకోకుంటే మరిన్ని సెక్షన్ల కింద కేసు పెడతామని క్వీన్స్ అటార్నీ రిచర్డ్ బ్రౌన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News