: బస్సులోనే ప్రసవం: తల్లీ, బిడ్డా క్షేమం
నెలలు నిండాయని ప్రసవం కోసం ఆర్టీసీ బస్సులో ఆసుపత్రికి వెళ్తున్న ఓ మహిళ బస్సులోనే పండంటి బిడ్డను ప్రసవించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం దగ్గర జరిగింది. ప్రసవం కోసం పట్టికుంటపల్లికి చెందిన నాగరత్నమ్మ హిందూపురం ఆసుపత్రిలో చేరేందుకు నేటి ఉదయం 7.30కు బస్సు ఎక్కింది. హిందూపురం చేరుకోకముందే ఆమెకు నొప్పులు ప్రారంభం కావడంతో, మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు బస్సు వద్దకు చేరుకుని తల్లీబిడ్డలను ఆసుపత్రికి తరలించారు.