: బాలయోగి స్టేడియంలో నేటి నుంచి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం


సిలికానాంధ్ర ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి నేడు తెర లేవనుంది. హైదరాబాదులోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నేడు ప్రారంభం కానున్న ఈ నాట్య సమ్మేళనం మూడు రోజుల పాటు కొనసాగనుంది. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో 18 దేశాల నుంచి తొమ్మిది వేల మంది నాట్యకారిణులు హాజరుకానున్నారు. ఈ నాట్య సమ్మేళనానికి ప్రముఖ నాట్య గురువులు శోభానాయుడు, యామిని కృష్ణమూర్తి, రాజారాధారెడ్డి, వేదాంతం రామలింగశాస్త్రి తదితరులు హాజరుకానున్నట్లు సిలికానాంధ్ర ఛైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు.

  • Loading...

More Telugu News