: గువహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య
అసోంలోని గువహటి ఐఐటీలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతిగృహంలో ఉరేసుకుని అతడు ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడిని బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న పరమేశ్వరరావుగా గుర్తించారు. మృతుడు విశాఖ జిల్లా వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గౌహతీలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.