: పారామిలటరీ, సైన్యం సహాయంతో తీవ్రవాదులను తుదముట్టిస్తాం: రాజ్ నాథ్ సింగ్
పారామిలటరీ బలగాలు, సైన్యం సహాయంతో తీవ్రవాదులను అంతమొందిస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. అసోంలోని సోనిత్ పూర్ జిల్లాను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జరిగిన దారుణంపై ఎన్ఐఏతో దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. అసోంకు 50 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను పంపామని ఆయన వివరించారు. ప్రజలంతా శాంతి, సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల కుటుంబాలకు ప్రధాని 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారని ఆయన తెలిపారు.