: 'రోబో'లు వద్దు... మనో వికాసమే ముద్దు: మోదీ


భారత విద్యా వ్యవస్థలో వ్యక్తిగత మనో వికాసమే లక్ష్యంగా బోధన జరగాలని, చెప్పింది చెప్పినట్టు చేసే 'రోబో'లు మనకొద్దని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నేటి మధ్యాహ్నం తన సొంత నియోజకవర్గం వారణాసిలో భారతరత్న మదన్ మోహన్ మాలవ్యా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం బనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ప్రసంగిస్తూ, శాస్త్ర రంగమైనా, సాంకేతిక రంగమైనా యువత మనో వికాసం ఏ మేరకు పెరిగిందన్నదే ముఖ్యమని ఆయన అన్నారు. గంగానది కొలువైన వారణాసి ఉన్నత విద్యావంతులకు నిలయమని మోదీ కొనియాడారు. చిన్నారులు మంచి ఉపాధ్యాయులుగా ఎదిగే వాతావరణాన్ని కల్పించేలా ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. టీచర్లుగా మారాలని భావించేవారు కేవలం పరీక్షల కోసం చదవకుండా ఉపాధ్యాయుల నుంచి ప్రేరణలు పొందాలని ఆయన సూచించారు. సుపరిపాలన దేశాభివృద్ధికి మార్గాలను చూపుతుందని, తన ఆరు నెలల పాలనలో ప్రపంచం మన వైపు చూస్తోందని గుర్తించానని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News