: ప్రపంచానికే గురువు భారత్: మోదీ


యావత్ ప్రపంచానికి విద్య నేర్పే అవకాశం ప్రస్తుతం మన ముందు ఉందని... మంచి ఉపాధ్యాయుల కోసం ప్రపంచం మన వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని... అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భారత్ ప్రపంచానికే గురువు అవుతుందని చెప్పారు. వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానాల సమూహమే మన విద్యా విధానమని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దాన్ని విజ్ఞాన శతాబ్దంగా అభివర్ణించారు. ఈ సందర్భంగా బెనారస్ హిందూ యూనివర్శిటీలో వైఫై సేవలను ఆయన ప్రారంభించారు. క్యాంపస్ కనెక్ట్ పేరుతో ఈ సేవలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, విశ్వవిద్యాలయంలో ఇంటర్ యూనివర్శిటీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.

  • Loading...

More Telugu News