: రెండేళ్ల పాపకు 52 ఏళ్ళంటూ 'ఆసరా' పెన్షన్ మంజూరు చేసిన టీఎస్ ప్రభుత్వ అధికారులు
మన ప్రభుత్వ అధికారులు తలచుకుంటే ఏమైనా చేయగలరేమో! ఒక వైపు తమకింకా పెన్షన్ రాలేదంటూ వృద్ధులు లబోదిబోమని మొత్తుకుంటుంటే జోగిపేట పట్టణంలో రెండేళ్ళ పాప దీక్షితకు ఆసరా పథకం కింద రూ.1000 పెన్షన్ మంజూరు చేసి అధికారులు అందరినీ ఆశ్చర్యపరచారు. పట్టణంలోని 17వ వార్డులో దీక్షిత పేరు మీద మూడవ విడత కార్యక్రమంలో పెన్షన్ మంజూరైంది. ఇంత చిన్నారికి పెన్షన్ ఎలా మంజూరైందంటూ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ పాపకు 52 ఏళ్లని, చేనేత కార్మికురాలని ఆసరా కార్డులో పేర్కొనడం విడ్డూరం. ప్రభుత్వాధికారులా మజాకా!