: నిన్నటిదాకా కెప్టెన్... ఇకపై కామెంటేటర్... మైకేల్ క్లార్క్ కొత్త అవతారం
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇకపై కొత్త అవతారంలో మైదానంలో కన్పించనున్నారు. గాయం కారణంగా చికిత్స పొందుతూ, మూడవ టెస్ట్ కు దూరమైన క్లార్క్ వ్యాఖ్యాతల బృందంలో చేరారు. రేపటి నుంచి మెల్ బోర్న్లో ప్రారంభంకానున్న భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్లో క్లార్క్ క్రికెట్ కామెంటరీ వినిపించనున్నారు. ఈ కొత్త జాబ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు క్లార్క్ పేర్కొన్నారు. కాగా, అతిత్వరలో క్లార్క్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పవచ్చని తెలుస్తోంది.