: వాజ్ పేయికి భారతరత్నతో ఆ పురస్కారానికే గుర్తింపు: వెంకయ్యనాయుడు
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ప్రకటనతో అవార్డుకే గుర్తింపు వచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సాధారణంగా భారతరత్న అవార్డుతో గ్రహీతలకు గుర్తింపు వస్తుందన్న ఆయన, వాజ్ పేయి విషయంలో మాత్రం భారతరత్నకే వన్నె వచ్చినట్లైందన్నారు. వాజ్ పేయికి అవార్డు ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా వెంకయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయిని ‘లివింగ్ భారతరత్న’గా వెంకయ్య అభివర్ణించారు. గొప్ప న్యాయవాదిగా పేరుగాంచిన మాలవ్యాకు కూడా భారతరత్న ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.