: 'పీకే'ను నిషేధించాలని సాంప్రదాయవాద సమూహాల డిమాండ్


నటుడు అమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం తాజాగా సాంప్రదాయవాద సమూహాల ఆగ్రహానికి గురైంది. పలు వర్గాల మనోభావాలను ఈ సినిమా బాధించిందంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రాన్ని వెంటనే రద్దు చేయాలని హిందూ జనజాగృతి సమితి (హెచ్ జేఎస్) డిమాండ్ చేస్తోంది. 'పీకే'లోని అంశం బాగా రెచ్చగొట్టే విధంగా ఉందని, ఓ వర్గ మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడింది. ఈ మేరకు నవీ ముంబయి, నాగపూర్, సంఘ్లీలో ఈ సినిమా, దర్శకనిర్మాతలపై ఫిర్యాదులు చేసినట్టు హెచ్ జేఎస్ కోఆర్డినేటర్ సునీల్ ధన్వత్ తెలిపారు. ఇదిలాఉంటే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన 'పీకే' విడుదలైన నాలుగు రోజులకి వంద కోట్లు వసూలు చేసింది.

  • Loading...

More Telugu News