: ఈ రోజు మధ్యాహ్నమే బాలచందర్ అంత్యక్రియలు
భారతీయ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడు బాలచందర్ అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జరగనున్నాయి. చెన్నైలోని బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంతకు ముందు బాలచందర్ అంత్యక్రియలు రేపు (గురువారం) జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపిన సంగతి తెలిసిందే. కొన్ని కారణాల రీత్యా అంత్యక్రియలను ఈ రోజే నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాలచందర్ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.