: బూట్లు లేవు, బుల్లెట్లు రావు... దయనీయ స్థితిలో భారత సైన్యం


సరిహద్దుల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి దేశ రక్షణ బాధ్యతలు చేపట్టిన సైనికుల కనీస అవసరాలు కూడా కేంద్రం తీర్చలేకపోతోంది. సియాచిన్, లేహ్ వంటి చలి ప్రాంతాల్లో ఉన్న వారి పరిస్థితి మరింత దారుణం. వారికి కనీస అవసరాలైన బూట్లు, దోమ తెరల సరఫరా కూడా లేదు సరి కదా, శత్రువులు దాడి చేస్తే ప్రతిఘటించేందుకు సరిపడినన్ని తుపాకులు, మందుగుండు సామగ్రి సైతం సక్రమంగా అందటం లేదు. దేశరక్షణ విభాగంపై మేజర్ జనరల్ బీ.సీ.ఖండూరి నేతృత్వంలోని 33 మంది ఎంపీల బృందం తయారుచేసిన నివేదికలో వెల్లడైన అంశాలివి. పార్లమెంట్ ముందుకు వచ్చిన ఈ నివేదిక ప్రకారం సైన్యానికి తక్షణం 2 లక్షల జతల యాంకిల్ లెదర్ బూట్లు, 13 లక్షల జతల కాన్వాస్ బూట్లు, లక్ష దోమ తెరలు అవసరం. అసలు ఎంతమంది దగ్గర బులెట్ ప్రూఫ్ జాకెట్లు ఉన్నాయన్న సమాచారం డిఫెన్స్ మినిస్ట్రీ వద్ద లేదు. రాత్రి పూట దృశ్యాలను స్పష్టంగా చూపే 'నైట్ విజన్ గాగూల్స్' మాత్రం సరిపడినన్ని ఉన్నాయి. సైన్యం అత్యధికంగా వాడే ఇన్సాస్ రైఫిళ్లను సరఫరా చేయడంలో డీఆర్డీఓ విఫలమైంది. ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన తుపాకుల అభివృద్ధిలో సైతం డీఆర్డీఓ వెనుకబడిందని నివేదిక స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News