: నర్సీపట్నంలో పోలీసుల ఓవరాక్షన్...పేకాట శిబిరంపై దాడి, ఒకరు మృతి


విశాఖ జిల్లా నర్సీపట్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నర్సీపట్నంలోని వేములపూడిలో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు పేకాటరాయుళ్లపై విచక్షణారహితంగా లాఠీలు ప్రయోగించారు. ఈ దాడిలో లాఠీ దెబ్బలు తాళలేక వెంకటరమణ అనే వ్యక్తి మరణించాడు. దీంతో బాధితుడి బంధువులు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప, వెంకటరమణ మరణానికి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News