: జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలివే


జమ్మూ కాశ్మీర్ ప్రజలు చరిత్రాత్మక తీర్పు వెలువరించారు. గతంలో ఎప్పుడూ ఎన్సీపీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరిగేది. ఏదో ఒక పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చేది. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. బీజేపీ రంగ ప్రవేశం, మోదీ ఊపు కారణంగా జమ్మూకాశ్మీర్ ఫలితాల్లో అనూహ్య మార్పులొచ్చాయి. మొత్తం 87 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) 15 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష పీడీపీ 28 స్ధానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 12 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ 25 స్థానాల్లో సత్తాచాటి రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించి సత్తాచాటారు. దీంతో జమ్మూకాశ్మీర్లో తొలిసారిగా హంగ్ అసెంబ్లీ ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో, ఏవైనా మూడు పక్షాలు పొత్తు పెట్టుకుంటే కానీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఏ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు అధికారం చేపట్టనున్నారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

  • Loading...

More Telugu News