: బీర్వా స్థానంలో ఒమర్ అబ్దుల్లా గెలుపు
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఆయన పోటీ చేసిన బీర్వా నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత ఉత్కంఠ కొనసాగింది. ఒకానొక సమయంలో ఒమర్ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఆయన ఓడిపోయినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే, చివరి రౌండ్లలో స్వల్ప ఆధిక్యత సాధించిన ఒమర్ చివరకు తన సమీప ప్రత్యర్థిపై వెయ్యి ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు, సోనావార్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన ఒమర్... అక్కడ మాత్రం ఓటమిని మూటగట్టుకున్నారు.