: కొల్లేరును బాబు తవ్వించాడా?: కొడాలి నాని
కొల్లేరు సరస్సును చంద్రబాబు నాయుడు తవ్వించాడా? అని వైకాపా ఎంఎల్ఏ కొడాలి నాని ప్రశ్నించారు. సరస్సును బాబు తవ్విస్తే, వైఎస్ రాజశేఖరరెడ్డి పూడ్చివేసినట్లు అధికార పార్టీ సభ్యులు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కొల్లేరు కాంటూరుపై నేటి సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్రమ చెరువులు తొలగించాలని సుప్రీంకోర్టు 2006లో ఆదేశిస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువులు తొలగించటం జరిగిందన్నారు. ఆ తరువాత కొల్లేరు కాంటూరుపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం బాబుకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. దురదృష్టవశాత్తూ వైఎస్ఆర్ చనిపోవటంతో ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ సమస్యపై పట్టించుకోలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యను పరిష్కరించాలని నాని కోరారు.