: చంద్రబాబు కట్టుకథలు చెప్పిస్తున్నారు: జగన్


ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. కొల్లేరు సరస్సును మూడో కాంటూరు వరకు కుదించాలని సర్కారు నేడు సభలో తీర్మానం పెట్టగా, ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. చంద్రబాబు తన పార్టీ శాసనసభ్యులతో కట్టుకథలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు పాలించిన బాబుకు అప్పుడు కొల్లేరు సమస్య గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. 2008లోనే వైఎస్ సర్కారు ఈ విషయమై తీర్మానం పెట్టిందని, పాత తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. కొల్లేరు ప్రాంత వాసుల స్థితిగతులను తెలుసుకునేందుకు వైఎస్సార్ ఓ కమిటీ కూడా వేశారని జగన్ గుర్తు చేశారు. తాజాగా తీర్మానం చేయడం రాజకీయ లబ్ధి కోసమేనని మండిపడ్డారు. ఏదేమైనా, తెలుగుదేశం పార్టీకి ఇన్నాళ్లకు ప్రజలపై ప్రేమ కలిగిందని, అందుకు సంతోషమని తెలిపారు.

  • Loading...

More Telugu News