: కాంగ్రెస్, జేఎంఎంల తప్పుల వల్లే బీజేపీకి లబ్ధి: జేడీ(యు)
జార్ఖండ్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండటంపై జేడీ(యు) స్పందించింది. అధికారపక్షంలోని సంకీర్ణ పార్టీలు జేఎంఎం, కాంగ్రెస్ లు తప్పులకు పాల్పడటం వల్లనే బీజేపీకి భారీగా లబ్ధి చేకూరిందని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి అన్నారు. దానివల్లే ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్దసేపటికి 19 స్థానాల్లో పదకొండు చోట్ల బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న సమయంలో త్యాగి తన స్పందన తెలియజేశారు.