: విరిగిన పట్టా... నర్సాపూర్ ప్యాసింజర్ కు తప్పిన పెను ప్రమాదం


నర్సాపురం నుంచి గుంటూరు వెళ్ళే ఫాస్ట్ ప్యాసింజర్ (57382)కు మంగళవారం ఉదయం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు ప్రయాణిస్తున్న మార్గంలో ఉండి వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేశాడు. 500 మందికిపైగా రైలులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది రైలును కొద్దిసేపు నిలిపివేసి పట్టాలకు మరమ్మతులు చేపట్టారు. దీంతో మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News