: పీడీపీతో కలసి తొలిసారి కాశ్మీర్ పీఠంపై బీజేపీ?


బీజేపీ తన చిరకాల వాంఛను తీర్చుకోనుంది. జమ్మూ కాశ్మీర్ పీఠాన్ని అధిరోహించాలన్న ఆ పార్టీ కోరిక తీరే సమయం ఆసన్నమైనట్టు కనిపిస్తోంది. పూర్తి మెజారిటీ రాకున్నా, మోదీ మాయాజాలం అనుకున్న దానికన్నా ఎక్కువే ప్రభావం చూపడంతో, అధికారం కైవసం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పీడీపీ నేతలతో చర్చిస్తున్నారు. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని రాజ్‌ నాథ్‌ సింగ్ నేటి ఉదయం వ్యాఖ్యానించారు. ఒకవేళ ఈ చర్చలు ఫలించి రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పక్షంలో ముఖ్యమంత్రి పదవిని బీజేపీ తీసుకుని, ప్రతిగా కేంద్ర ప్రభుత్వంలో పీడీపీకి కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News